Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్‌పై కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు జారీచేసింది. శాసనసభ నియోజికవర్గాల సంఖ్య పెంచుతూ, వాటి సరిహద్దులు మార్చుతూ 'డీలిమిటేషన్ కమిషన్' సిఫారసులు చేసింది. ఈమేరకు కమిషన్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ మార్చిలో హాజీ అబ్దుల్ గనీఖాన్, ఆయుబ్ మాటూ అనే ఇద్దరు కాశ్మీరీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత లేదని, అధికారం లేదని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం..తాజాగా తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, ఈసీకి నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 30న సుప్రీం చేపట్టనున్నది. డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజికవర్గాల సరిహద్దులను కొత్తగా ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అసెంబ్లీ స్థానాల సంఖ్యను 83 నుంచి 90కు పెంచింది. పెరిగిన స్థానాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా, ఆరు స్థానాలు జమ్మూలో ఉన్నాయి. దాంతో జమ్మూలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 43కు చేరుకున్నాయి.