Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తపై కోపంతో ఇల్లు తగులబెట్టిన భార్య
- వారితో సహా నలుగురు మృతి
పాట్నా : భర్త రెండో పెళ్లి చేసుకున్నారన్న ఆగ్రహంతో భార్య ఆయన ఇంటిని తగుల బెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బీహార్‌లోని దర్భంగా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయి పదేళ్లు గడిచినా పిల్లలు లేరంటూ ఖుర్షీద్ ఆలం (40) రెండేళ్ల కిందట సమీప గ్రామానికి చెందిన రోష్మి ఖాతూన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటిభార్య బీబీ పర్వీన్ (35)కు, ఆలంకు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. శనివారం వారిమధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. భర్త తీరుతో తీవ్ర అసహనానికి గురైన బీబీ పర్వీన్ ఉదయం 5.00 గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా..పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించింది. ఈ మంటల్లో పర్వీన్‌తో పాటు ఆలం తల్లి రుఫైదా ఖాతూన్ (65) కాలి బూడిదయ్యారు. రోష్మి ఖాతూన్, ఖుర్షీద్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.