Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యక్రమాన్ని బహిష్కరించిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు
అగర్తల : త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాణిక్ సాహా చేత గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ప్రమాణస్వీకా రం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాహాను ముఖ్యమం త్రిగా నియమించడాన్ని నిరసిస్తూ శనివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కుర్చీలు విరగ్గొట్టిన ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ, మంత్రి రామ్ ప్రసాద్ పాల్ ప్రమాణ స్వీకారం ముగిసిన క్షణాల తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీలో ముఠా కుమ్ములాటలతో సీఎం పదవికి శనివారం ఆక్మస్మికంగా రాజీనామా చేశారు. మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించడం ఏకకాలంలో జరిగిపోయాయి. కాగా, ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమా న్ని ప్రతిపక్ష సీపీఐ(ఎం) పార్టీ బహిస్కరించింది.రాష్ట్రంలో బీజేపీ పాలనలో'ఫాసిస్ట్ తరహా హింస' విజృంభిస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.