Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు జిల్లాలకు రెడ్ ఎలర్ట్
తిరువనంతపురం : కేరళలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా, లోతట్టు ప్రాంతాలు జలమయం మయ్యాయి. అరేబియా సముద్రం నుంచి బలమైన పశ్చిమ గాలుల ప్రభావం కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో కేరళ, లక్షద్వీప్‌ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో ఐదు జిల్లాలకు రెడ్ ఎలర్ట్, ఏడు జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు గత 24 గంటల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 20 సెంమీ వర్షపాత నమోదయింది. అలువ, ఇరింజలకుడల్లో 19 సెంమీ, 16.7 సెంమీ వర్షపాతం నమోదయింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కేరళ తీరం వెంబడి చేపల వేటను నిషేధిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదివారం ప్రకటించింది.