Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రిని మార్చడం ఎన్నికల జిమ్మిక్కే
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని నెలల ముందు త్రిపుర ముఖ్యమంత్రిని మార్చడం కేవలం జిమ్మిక్కే అనీ, అది ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయదని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఆ రాష్ట్రంలో అధ్వాన్నమైన పాలన, పెరుగుతున్న ఆర్థిక భారాలు, భయాందోళనలు ఉన్నాయని అన్నారు. త్రిపురలో హఠత్తుగా బీజేపీ ముఖ్యమంత్రిని మార్చడంపై సీతారాం ఏచూరి స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఏమీలేదని, పైగా ఫాసిస్ట్ హింస పెరిగిందని విమర్శించారు. త్రిపురలో రాజ్యాంగ ఆదేశాలను ద్వంసం చేశారనీ, శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్థిక భారాలు పెరిగాయని పేర్కొన్నారు. త్రిపుర ప్రజలు రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.