Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక భవిష్యత్ కార్మికులదే !
- రోమ్‌లో డబ్ల్యూఎఫ్‌టీయూ 18వ మహాసభల పిలుపు
న్యూఢిల్లీ : ఇక భవిష్యత్తు అంతా కార్మికులది, కార్మిక పోరాటాలదేనని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) 18వ మహాసభ పిలుపిచ్చింది. ఈ నెల 6-8 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్‌లో మహాసభలు జరిగాయి. కాలపరీక్షకు నిలిచిన వర్గపోరాటాలు, శ్రామికవర్గ అంతర్జాతీయవాదం బాటలో ప్రపంచ కార్మిక వర్గం సమైక్యంగా ముందుకు సాగాలని మహాసభ పిలుపిచ్చింది. అయితే ఈ భవిష్యత్ దానంతట అదే రాదని, పెట్టుబడిదారీవాదమనే బురద నుండి బయటకు లాగాల్సి వుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గంపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యుత్సాహమైన వాతావరణంలో, విశ్వాసాన్ని ప్రతిబింబించేలా డబ్ల్యుఎఫ్‌టియు 18వ మహాసభలు జరిగాయి. ప్రపంచ నలుమూలలా పెరుగుతున్న కార్మిక వర్గ పోరాటాల్లో ఈ విశ్వాసం ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా యువత, మహిళలు ఈ పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.'' మన సమకాలీన అవసరాల కోసం, సామ్రాజ్యవాద నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, సమైక్యంగా ముందుకు సాగుదాం ! అన్ని నినాదంతో ఈ మహాసభలు జరిగాయి.
మహాసభల సందర్భంగా డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి సభ ముందుంచిన నివేదికపై 99మంది ప్రతినిధులు మాట్లాడారు. వీరిలో కొంతమంది ఆన్లైన్లో కూడా పాల్గొన్నారు. సీఐటీయూ తరపున అధ్యక్షురాలు హేమలత, జాతీయ కార్యదర్శులు స్వద్ే దేవ్ రారు, ఎలమారం కరీం, అనది సాహూలతో కూడిన ప్రతినిధి బృందం మహాసభల్లో పాల్గొంది. ఆన్లైన్ ద్వారా మరో 15మంది సీఐటీయూ ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. టీయూఐ ఎనర్జీకి ప్రాతినిధ్యం వహిస్తూ మరో జాతీయ కార్యదర్శి ప్రశాంత నంది చౌదరి కూడా మహాసభల్లో పాల్గొన్నారు.
మహాసభల చివరి రోజైన 8వ తేదీన ఐదు ఖండాలకు చెందిన 50దేశాల నుండి ప్రతినిధులతో కొత్త ప్రెసిడెన్షియల్ కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దక్షిణాఫ్రికాకు చెందిన మైఖేల్ మిజ్ వాండిలే మక్వాయిబా డబ్ల్యూఎఫ్‌టీయూ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు.ప్రెసిడెన్షియల్ కౌన్సిల్లో ప్రధాన కార్యదర్శి,కార్యదర్శివర్గం, ఉపాధ్యక్షులు, ఫైనాన్షియల్ కంట్రోల్ కమిటీ వుంటాయి. ప్రధాన కార్యదర్శిగా సైప్రస్‌కి చెందిన పంపిస్ కిరిట్సిస్ ఎన్నిక కాగా,స్వదేశీ దేవ్ రారు డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికవ్వగా,హేమలత ఒక ఉపా ధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.పది దేశాల ప్రాతినిధ్యం తో సెక్రటేరియట్,ఏడు దేశాల ప్రతినిధులతో ఫైనాన్స్ కంట్రోల్ కమిషన్ ఏర్పడ్డాయి.