Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. విమాన ఇంధన ధరల మోత మోగుతోంది. సోమవారం ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఎటిఎఫ్) ధరను 5.3 శాతం పెంచింది. దీంతో ఢిల్లీలో కిలోలీటర్ ధర రూ.6,188.26 పెరిగి రూ.123,039.71 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టానికి చేరింది. ఈ ఏడాదిలో ఎటిఎఫ్ ధర పెరగడం వరుసగా ఇది పదోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఆధారంగా ఎటిఎఫ్ ధరను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో మార్చుతుంటారు. ఈ ఏడాది జనవరి 1 నుండి ప్రతి 15 రోజులకోసారి వీటి ధరలు పెరుగు తూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎటిఎఫ్ ధర సుమారు 55శాతం (రూ.49,017.8) పెరిగిం ది. విమాన నిర్వహణలో సుమారు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే. పెరిగిన విమాన ఇంధన ధరల భారం ప్రయాణికులపై పడే అవకాశం ఉంది.