Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిస్పూర్ : అసోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. కాచర్ జిల్లాలో పరిస్థితి భయానకంగా ఉందనీ, వరదల కారణంగా జిల్లాకు చెందిన 41వేల మంది ప్రభావితమయ్యారని అన్నారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని అన్నారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎఎస్డీఎంఏ) నివేదిక ప్రకారం.. 138 గ్రామాలకు చెందిన 41,037 ప్రజలపై తీవ్ర ప్రభావం పడిందనీ, 1,685 మందిని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలించినట్టు తెలిపింది. వరదల ధాటికి ఆదివారం కాచర్జిల్లాకు చెందిన ఒక చిన్నారి సహా ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. 2,099.6 హెక్టార్లలో పంట నీట మునిగింది. కోపిలి నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది.