Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్లో సీసీటీవీ అమర్చడంపై సాయిబాబా ఆవేదన
ముంబయి : నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో తన సెల్ మొత్తం కనిపించేవిధంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ తక్షణమే తొలగించాలని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కోరారు. సీసీటీవీ అమర్చడంతో టాయిలెట్‌ను ఉపయోగించుకోలేకపోతున్నానని, కనీసం స్నానం కూడా చేయడం లేదని సాయిబాబా ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ తక్షణమే తొలగించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ మేరకు సాయిబాబా భార్య వసంత కుమారి, సోదరుడు జి రామదేవుడు మహారాష్ట్ర హోం మంత్రికి ఈ నెల 14న లేఖ రాసారు. సాయిబాబా సెల్లో సిసిటివి కెమెరాను తక్షణమే తొలగించాలని, గోప్యత, గౌరవం కల్పించాలని కోరారు. ఈ లేఖ ప్రకారం ఈ నెల 10న ఈ కెమెరాను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటలూ సాయిబాబా సీసీటీవీ నిఘాలో ఉంటారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయే ఆరోపణలతో ఉపా చట్టం కింద 2007లో గచ్చిరోలిలోని కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. దీనికి వ్యతికేరంగా సాయిబాబా వేసిన పిటీషన్ బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ వద్ద విచారణలో ఉంది. సాయిబాబా 90 శాతం వికలాంగులు. వీల్‌చైర్ మీద ఆధారపడతారు. పైగా సాయిబాబా అనేక రోగాలతో బాధపడుతున్నారు.