Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారహక్కు చట్టం కింద ఆర్బీఐ వెల్లడి
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో రూ.40,295 కోట్ల విలువ చేసే మోసాలు నమోదయ్యాయని ఆర్బీఐ తెలిపింది. 2020-21లో జరిగిన రూ.81,922 కోట్ల మోసాలతో పోల్చితే 51 శాతం తగ్గుదల చోటు చేసుకుందని సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది. 12 పీఎస్బీల్లో 2020-21లో 9,933 కేసులు నమోదు కాగా.. 2021-22లో 7,940 మోసపు కేసులు చోటు చేసుకున్నాయి. 2021-22లో పీఎన్బీలో అత్యధికంగా రూ.9,528 కోట్ల మోసాలు జరిగాయి. ఎస్బీఐలో రూ.6,932 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు, యూనియన్ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల విలువ చేసే మోసాలు చోటు చేసుకున్నాయి.