Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో కేవలం 3శాతం మందికి సహాయక పరికరాలు
- ప్రపంచంలో 250కోట్లమందికి వీల్‌చైర్..హియరింగ్ ఏయిడ్స్ అవసరం : డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ : వికలాంగుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చేవి 'సహాయక పరికరాలు'. మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి సమస్యను దూరం చేసే 'హియరింగ్ ఏయిడ్స్', కండ్లద్దాలు, ఇతర పరికరాలు అందుబాటులోనివారు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 250కోట్లమంది ఉన్నారని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' తాజా నివేదిక వెల్లడించింది. వికలాంగులకు సహాయక పరికరాలు అత్యంత తక్కువగా అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉందని 'గ్లోబల్ రిపోర్ట్ ఆన్ అసిస్టీవ్ టెక్నాలజీ' నివేదిక పేర్కొన్నది. 70దేశాలపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికలో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి...
స్వల్ప, మధ్యస్థాయి ఆదాయం గల దేశాల కేటగిరిలో సహాయక పరికరాలు అందుబాటులో ఉన్న వికలాంగుల సంఖ్య 3శాతం లోపే ఉంది. భారత్ కూడా ఇదే కేటగిరిలో ఉందని సర్వే తెలిపింది. నివేదికను విడుదల చేస్తూ డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఏమన్నారంటే, ''ప్రపంచవ్యాప్తంగా వికలాంగులు నిరాదరణకు గురవుతున్నారు. వారు ఎంతమంది ఉన్నారన్నది మేం అంచనా వేయాలనుకున్నాం. ఇలాంటి నివేదిక మొదటిదే గావచ్చు, కానీ ఇంత పెద్ద సంఖ్యలో వికలాంగులు సహాయక పరికరాలు లేకుండా జీవనం సాగించటం శోచనీయం'' అని అన్నారు. కంటి చూపులేనివారు 20.9శాతం, అంగవైకల్యం గలవారు 12.1శాతం, చెవటి-4.8శాతం, మూగ-2.4శాతం, కదలలేనివారు 4.1శాతం, మానసిక వికలాంగులు 6.4శాతం..ఉన్నారని సర్వే తెలిపింది. భారత్‌లో సహాయక పరికరాల అందజేతపై కేంద్ర ఆరోగ్యశాఖలో ఒక ఏజెన్సీ లేకపోవటం పెద్ద సమస్య అని నిపుణులు చెబుతున్నారు.