Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. అలాగే హిందీని కూడా వ్యతిరేకించనని స్పష్టం చేశారు. కమల్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన సినిమా 'విక్రమ్' ట్రైలర్, పాటల విడుదల కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ... సినిమా, రాజకీయాలు కవలపిల్లలనీ, అందుకే రెండింటికి సమ ప్రాధాన్యమిస్తున్నానని అన్నారు. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం తన బాధ్యత అనీ, ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని అన్నారు. అయితే దీనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, మాతృభాషను మరవకూడదని అన్నారు. హిందీకి వ్యతిరేకినని చెప్పనని, అలాగే, గుజరాతీ, చైనీస్ భాషలు కూడా మాట్లాడవచ్చని అన్నారు. చివరి సమయంలో నటుడు సూర్య మాకు సహకరించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో సూర్య కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.