Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఎస్టీఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) 8వ జాతీయ మహాసభలు విజయవాడలోని ఎంబీ విజ్ఞానకేంద్రం ఆడిటోరియంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరగనున్నాయని ఫెడరేషన్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అభిజిత్ ముఖర్జి, సిఎన్ భారతి తెలిపారు. విజయవాడలోని యుటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టరును వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఎస్టీఎఫ్ఐ దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 31 ఉపాధ్యాయ సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. ఈ సంఘాల నుండి మహాసభలకు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సభలను జస్టిస్ కె చంద్రు ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ఆయన ''సామాజిక న్యాయం'' అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. మహాసభల్లో ''మహిళలు-రక్షణ'' అంశంపై ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ''ఆర్థిక సంస్కరణలు-ప్రైవేటీకరణ'' అంశంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుర్జీత్ మజుందార్, ''మతతత్వం'' అంశంపై తీస్తాసెతల్వాద్ తదితరులు మాట్లాడతారని అన్నారు. ఎస్టీఎఫ్ఐ కేవలం ఉపాధ్యాయుల సమస్యలపై మాత్రమే కాకుండా సమాజంలో నెలకొన్న అసమానతలు, అన్యాయాలపై పోరాడుతుందని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక స్వాతంత్య్రానంతరం దేశప్రజలు సృష్టించిన సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే పనిలో ఉందన్నారు. రామమందిర్, మసీదు అంశాలను అడ్డుపెట్టుకుని మతకల్లోలాలు సృష్టిస్తోందని తెలిపారు. తాజ్మహల్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలను సైతం వివాదాల్లోకి లాగుతోందని విమర్శించారు.
అంతేగానీ ప్రజలపై మోపిన పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలను, నిరుద్యోగాన్ని తగ్గించడం వంటి అంశాలు కేంద్రానికి ఏమాత్రం పట్టడం లేదని తెలిపారు. పేదవారికి విద్యను దూరం చేసేవిధంగా నూతన విద్యావిధా నాన్ని తీసుకొచ్చి దేశంపై రుద్దుతోందని, విద్యను కూడా ప్రైవేటీకరణ చేసి బిజెపి దుర్మార్గంగా వ్యవహ రిస్తోందన్నారు. ఈ విధానంతో