Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ సంతాపం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ రైతు నాయకుడు గౌలం ముహమ్మద్ జౌలా (85) గుండెపోటుతో మృతిచెందారు. జౌలా మృతిపై అఖిల భారత రైతు సభ (ఏఐకేఎస్) సంతాపం ప్రకటించింది.40 ఏండ్లకు పైగా రైతు ఉద్యమంలో భాగమయ్యారనీ, రైతుల ప్రయోజనాలు పరిరక్షించడం కోసం నిలబడ్డా రనీ, దృడ సంకల్పంతో మత సామరస్యాన్ని రక్షించారని తెలిపింది. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకూ భారతీయ కిసాన్ యూనియన్ నిర్మాణంలో పాలుపంచుకున్నారనీ, మహేంద్ర సింగ్ టికాయిత్కు కుడిభుజంగా పేరు పొందారని గుర్తు చేసుకుంది. ఇటీవల ఢిల్లీ సరిహద్దులో జరిగిన రైతు పోరాటానికి జౌలా హజరయ్యారని ఎఐకెఎస్ వెల్లడించింది. జౌలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.