Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముంబయి వీధుల్లో పువ్వులు అమ్మి జీవించే సరితా మాలి (28) అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు అడ్మిషన్ పొందింది. ఆమె ప్రస్తుతం జేఎన్యూలోని భారతీయ భాషా కేంద్రంలో హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేస్తోంది. జేఎన్యూలో ఎంఎ, ఎంఫిల్ లను పూర్తి చేసిన ఆమె జులైలో పీహెచ్డీని సమర్పించనుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయనీ, ప్రతి ఒక్కరికి తమవైన కథలు, బాధలు ఉంటాయని సరితా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు సమస్యల నెలవైన సమాజంలో తాను పుట్టానని అన్నారు. చిన్న నాటి నుంచి పండుగల సమయాల్లో తన తండ్రితో కలిసి పూలు విక్రయించేవారమనీ, కరోనాతో తన తండ్రి జీవనోపాధి కోల్పోయారని పేర్కొంది. పుట్టినప్పటి నుంచి పూలను మాత్రమే చూశానని ఇదే తన జీవితం అని ఆగిపోలేదని అన్నారు. పోరాటాలు, ఆశలు, సమస్యలు, కష్టపడి పనిచేయాలనే అభిరుచి అన్నీ ఉన్నాయని.. తన కుటుంబం మద్దతుతో ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. జేఎన్యూ తనజీవితాన్ని మార్చిందని అన్నారు. ఇక్కడ అడ్మిషన్ పొందకపోయి ఉంటే తన జీవితం ఎలా ఉండేతో తెలియదని అన్నారు. తన సమాజం నుండి వచ్చే ప్రజలకు జేఎన్యూ మంచి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.