Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నొయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్ కూల్చివేత గడువును సుప్రీంకోర్టు ఆగస్ట్ 28 వరకు పొడిగించింది. తాము ఊహించిన దానికన్నా ఆ నిర్మాణం మరింత బలంగా ఉందనీ, దీంతో ఈ అక్రమ నిర్మాణం తొలగించేందుకు మరికొంత గడువు కావాలని కోరింది. దక్షిణాప్రికా కంపెనీ జెట్ డిమోలేషన్ సహాయంతో ఏప్రిల్ 10న టెస్ట్ బ్లాస్ట్‌ను నిర్వహించింది. నొయిడాలోని సెక్టార్ 93ఏలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ హౌసింగ్ సొసైటీలోని సుమారు 100 మీటర్ల పొడవైన ట్విన్ టవర్స్‌ను మే 22 నాటికి కూల్చివేయాలని గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.