Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో పాఠ్యపుస్తకాల్లో బీజేపీ సర్కార్ మార్పులు
- భగత్‌సింగ్ జీవితచరిత్ర తొలగింపు..
- అభ్యుదయవాదుల రచనలు పక్కకు
న్యూఢిల్లీ : కర్నాటకలో బీజేపీ సర్కార్ మరో వివాదానికి తెరలేపింది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పదో తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా బోధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగ పాఠాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించ బోతున్నారు. దీనికి సంబంధించి టెక్ట్స్‌బుక్స్‌లో ఆయన ప్రసంగాన్ని ముద్రించారు. హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని టెక్ట్స్‌బుక్ రివిజన్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆల్ ఇండియా డెమొక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్వో), ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్ఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠ్యపుస్తకాల్లో హెగ్డేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కన్నడ మొదటి భాషగా ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి హెడ్గేవార్ ప్రసంగాన్ని బోధించబోతున్నారు. అలాగే కన్నడ భాషా పుస్తకంలో, అనుబంధ పుస్తకంలోని పాఠ్యాంశాల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. మరోవైపు అభ్యుద యవాది జి.రామకృష్ణ రాసిన 'భగత్‌సింగ్', జర్నలిస్ట్ పి.లోకేశ్ రాసిన 'మృగ మట్టు సుందారి' అనే పాఠ్యాంశాల్ని 'రివిజన్ కమిటీ' తొలగించింది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేేపుతోంది. రాష్ట్రమంత్రి బి.సి.నగేశ్ ప్రభుత్వ చర్యల్ని సమర్థించారు. ''ఇందులో అభ్యంతరం వ్యక్తం చేసే విషయం ఏముంది? పాఠ్య పుస్తకాల్లో కొన్ని తొలగించాం. కొన్ని కొత్తగా చేర్చా''మని అన్నారు. ప్రభుత్వ తీరుపై కన్నడనాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజల్లో మత చిచ్చు : ఏఐడీఎస్వో
భగత్‌సింగ్ పాఠ్యాంశాన్ని తొలగించటం, హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చటంపై కన్నడ రచయితలు, అభ్యుదయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ''దేశం కోసం 23ఏండ్ల చిన్న వయస్సులో భగత్‌సింగ్ ప్రాణాల్ని అర్పించారు. అలాంటి మహనీయుడి పాఠ్యాంశాన్ని తొలగించి..మత విద్వేష భావజాలాన్ని విస్తరించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ గురించి విద్యార్థులకు బోధించబోతున్నారు.