Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత సీజే సతీష్ చంద్ర మిశ్రా ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
- ఐదు రాష్ట్రాల హైకోర్టుల సీజేల నియామకానికి కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి రాష్ట్రాల హైకోర్టుకు కొత్త సీజేలను నియమించనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు పదోన్నతి కల్పించి సీజేగా నియమించేందుకు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయనున్నారు.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ.సయీద్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయాను గౌహతి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.