Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతరిస్తున్న దేశీయ జీవాలు ఒంగోలు గిత్తలు కూడా ...
- 2012-19 మధ్య పడిపోయిన 23 జాతుల సంఖ్య : నివేదిక
న్యూఢిల్లీ : రైతు ఇంటిలో పశువులు కనిపించేవి. మేకలు,కోళ్లు కూడా ఉండేవి. కానీ ఇపుడు భూమినే నమ్ముకున్న అన్నదాత బతుకే భారంగా మారిపోయింది. మోడీ ప్రభుత్వం వచ్చాక రైతు పరిస్థితి అగమ్యగోచ రంలా మారిపోయింది. వృద్ధాప్యద శకు చేరిన పశువులను అమ్ముకోవటానికి అనుమతిలేదు. గో దాడులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందూత్వమూకలు బరితెగిస్తున్నాయి.
గో సంరక్ష అంటూ ఎన్నికల అస్త్రంలా మార్చుకున్నది బీజేపీ. గోశాలల్లో ఆవుల మరణమృదంగం వినిపిస్తోంది. మోడీ పాలనలో పశుగ్రహణం పట్టిందనటానికి కేంద్రం సమర్పించిన తాజా నివేదిక నిర్ధారిస్తోందిభారత్లో దేశీయ పశువుల సంఖ్య తగ్గిపోయింది. 2012-19 మధ్య 23 జాతుల సంఖ్య పడిపోయింది. దేశీయ పశువుల మొత్తం సంఖ్య 2012లో 15.12 కోట్ల నుంచి 2019లో ఆరు శాతం తగ్గి 14.21 కోట్లకు తగ్గింది. దీంతో ఈ కాలంలో మొత్తం పశువుల జనాభాలో వాటి వాటా 79 శాతం నుంచి 73 శాతంకి పడిపోయినట్టయ్యింది. భారతదేశంలో పశువులు, పౌల్ట్రీకి సంబంధించిన తాజా జాతుల వారీ నివేదిక ప్రకారం.. 23 జాతుల దేశీయ పశువుల సంఖ్య 2012-19 మధ్య ఏడేండ్లలో 1.08 శాతం నుంచి 93.48 శాతం వరకు తగ్గింది. 2018-19లో నిర్వహించిన 20 వ పశు గణన ఆధారంగా రూపొందించిన నివేదికను కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి పరుషోత్తం రూపాల విడుదల చేశారు.
నివేదిక ప్రకారం.. దేశీయ పశువుల మొత్తం సంఖ్య 2012లో 15.12 కోట్ల నుంచి 2019లో ఆరు శాతం తగ్గి 14.21 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో మొత్తం పశువుల జనాభాలో వాటి వాటా 79 శాతం నుంచి 73 శాతానికి పడిపోయింది. అయితే, అన్యదేశ లేదా సంకర జాతి పశువల సంఖ్య 2012లో 3.9 కోట్ల నుంచి 2019లో ఐదు కోట్లకు పెరిగింది. నివేదిక దేశీ పశువుల జనాభాను రెండు గ్రూపులుగా విభజించింది. 41 గుర్తించబడిన జాతులు, గుర్తించబడని జాతులున్నాయి. దేశీయ పశువుల జనాభాలో, 2019లో గుర్తించబడని సంఖ్య 10.02 కోట్లతో అత్యధికంగా ఉన్నది. అయితే, 41 జాతులు కలిపి 2.49 కోట్లుగా ఉన్నాయి.
ఖరియార్ (-93 శాతం), ఖేరిగఢ్ (-75 శాతం), కెంకత (-67 శాతం), మోటు (56శాతం), హర్యానా (56 శాతం)వంటి ఐదు జాతులలో వాటి సంఖ్య గరిష్టంగా క్షీణించింది. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కనిపించే ఖరియార్ల సంఖ్య 2013లో 3,83,824 నుంచి 2019నాటికి 25,021కి తగ్గింది. 2012-19 మధ్య పెరిగిన 14 దేశీయ జాతులు పెరిగాయి. వేచూర్ (512 శాతం), పుంగనూరు (369 శాతం), బర్గూర్ (240 శాతం), బచౌర్ (181 శాతం), కృష్ణా లోయం (57 శాతం), పులికులు (38 శాతం), సిరి (36 శాతం), గిర్ (34.12 శాతం), అమృతమహల్ (31 శాతం), సాహివాల్ (22 శాతం), ఒంగోలు (11 శాతం), రెడ్ సింధీ (10 శాతం), నిమారి (ఆరు శాతం), పొన్వారి (2.46 శాతం) ఉన్నాయి.
ఒంగోలు గిత్తలు కూడా మాయం
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు గిత్తలకు ఎంతో ఆదరణ.. ఇతర దేశాల్లో ఉన్న ఆవులకంటే బలిష్టంగా ఉండటమే కాకుండా..ఎంత బరువైనా సులువుగా లాగటంతో పాటు...సేద్యానికి ఎంతగానో ఉపయోగపడేవి. అలాంటి ఒంగోలు గిత్త ఇపుడు కనుమరుగైంది. మనకన్నా బ్రెజిల్ దేశంలో ఒంగో లుగిత్తలు ఎక్కువగా కని పిస్తాయి. దీనికి కారణం ఏమిటంటే..ఏండ్ల కిందట ఆ దేశస్థులు ప్రకాశం జిల్లాకు వచ్చి..గిత్తను దత్తత తీసుకుని...దాని ఆలనాపాలనా కింద నెలనెల పైసలు పంపేవారు. అయితే ఇక్కడ వెటర్నిటీ వైద్యులు, బ్రెజిల్ దేశ స్థులతో కుమ్మక్కై ..గిత్తల బ్రీడింగ్ ( సెమ్)ను అక్రమంగా తరలించేవారు. దీనికి పరిహారం వారికి భారీగా ముట్టజెప్పేవారు.ఈ విధంగా ఒంగోలు గిత్తలు కాస్త క్రమక్రమంగా కనుమరుగయ్యాయని అక్కడి రైతులు చెబుతున్నారు.