Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్‌తో ఆల్‌టైం కనిష్టానికి పతనం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అత్యంత పేలవంగా నమోదయ్యింది. చరిత్రలో ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో అమెరికా డాలర్‌తో రూపాయి విలువ గురువారం ఏకంగా 77.73 పడిపోయింది. ఉదయం 77.72 వద్ద తెరుచుకున్న రూపాయి విలువ ఇంట్రాడేలో ఏకంగా 77.76 కనిష్టాన్ని తాకింది. రూపాయి చరిత్రలోనే ఇది అతి గరిష్ట స్థాయి పతనం కావడం గమనార్హం. గత పది రోజులుగా రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. దేశంలో అధిక ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ల పతనం, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్ల విలువైన షేర్లను తరలించుకుపోయారని అంచనా. గురువారం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు కోల్పోవడంపై రూపాయిపై మరింత ఒత్తిడి పెంచింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకోవడం రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.