Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23కి వాయిదా వేసిన వారణాసి కోర్టు
- సర్వే నివేదికను సమర్పించిన ప్రత్యేక సర్వే కమిటీ
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఈ నెల 20న సుప్రీంకోర్టు విచారించనుంది. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని, అప్పటివరకూ ఈ కేసును కొనసాగించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో వారణాసి కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదులో కాశీ విశ్వనాధ ఆలయానికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయంటూ వారణాసి కోర్టులో దాఖలైన రెండు పిటిషన్లకు సంబంధించి ఈ నెల 18న విచారణ జరగాల్సి ఉండగా, ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారి వ్యాఖ్యలపై న్యాయవాదుల సమ్మె కారణంగా విచారణ జరగలేదు. గురువారం ఇరు పక్షాలు తమ అభ్యంతరాలను, ప్రతివాదనలను దాఖలు చేశాయి. జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ అందజేసింది. సర్వేకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాటికి సంబంధించిన ఫిల్మ్‌ను సీల్డు కవర్లో కోర్టుకు సమర్పించింది.