Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
చండీగఢ్ : హర్యానా రాష్ట్రంలో ఝాజ్జర్ జిల్లాలోని కుండలీ-మనేసర్-పాల్వాల్ హైవే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి గురువారం తెల్లవారుజా మున ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 11 మంది గాయపడ్డారు. అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని అనంతరం సమీపంలోని ఫుట్‌పాత్‌పై సేదతీరారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవరు పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు పీజీఐఎమ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి అమిత్ యశ్వర్థన్ వెల్లడించారు.