Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు అథారిటీ (యూఐడీఏఐ) జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతీ వ్యక్తికీ తన పనితో సంబంధం లేకుండా గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంది. అలాగే సెక్స్ వర్కర్ల గోప్యతను ఉల్లంఘించకూడదని, వారి గుర్తింపును బహిర్గతం చేయ కూడదని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీఓ)లోని గెజిటెడ్ అధికారి లేదా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సమర్పించే ఎన్రోల్మెంట్ ఫారం ఆధారంగా యూఐడీఏఐ జారీ చేసే ప్రోఫార్మా సర్టిఫికేట్ ఆధారం ఆధార్ కార్డులు ఇవ్వాలని ధర్మాసనం గురువారం ఆదేశించింది.
ఎలాంటి గుర్తింపు రుజువు లేని, రేషన్ సరఫరా అందని సెక్స్ వర్కర్ల గుర్తింపు ప్రక్రియను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్ సంక్షోభం కారణంగా సెక్స్‌వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బం దులను ప్రస్తావిస్తూ దాఖలైన పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.