Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి యత్నాలను అనుమతించకూడదు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : మతపరమైన స్థలాల ప్రస్తుత స్వభావాన్ని మార్చే ఎటువంటి యత్నాలను అనుమతించకూడదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. జ్ఞానవాపి మసీదు వివాదం నేపథ్యంలో గురువారం ఒక ప్రకటన చేసింది. తన పర్యవేక్షణలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో వీడియో తీయాలని వారణాసి జిల్లా కోర్టు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల మతతత్వ శక్తులు ఉద్రిక్తతలు పెంచేందుకు ఉపయోగపడే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ, 1991 ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటించేలా చూడాలని, ఆ చట్ట స్ఫూర్తికి ఎటువంటి భంగం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. మతపరమైన స్థలాలపై ఇటువంటి వివాదాలను నివారించాలని, వాటి ప్రస్తుత స్వభావాన్ని మార్చే ఎలాంటి యత్నాలను అనుమతించకూడదని కోరింది.