Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత రెండేండ్లుగా వాయిదా పడిన ఆర్మీలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పిలుపు మేరకు ఇండియన్ ఆర్మీలో ఖాళీల భర్తీ జాప్యం జరగడాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనిట్లు ఆందోళన చేపట్టాయి.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఖాళీలను స్వల్పకాలిక ప్రాతిపదికన భర్తీ చేయడం భారత సైన్యం ప్రతిష్టను దిగజార్చిందనీ, ఇది మన జాతీయ భద్రత పట్ల మరింత రాజీపడినట్టే అని పేర్కొంది. ఆర్మీలో రెండేండ్లుగా ఆగిపోయిన రిక్రూట్మెంట్, సైన్యంలో కాంట్రాక్టు రిక్రూట్ మెంట్కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్, లక్నో యూనివ ర్సిటీ, ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2020, 2021 సంవత్సరాల్లో నమోదు చేసుకోవడానికి అర్హులైన విద్యార్థులు, యువ అభ్యర్థులందరికీ కనీసం రెండేండ్లు వయస్సు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అగ్నివీర్ వంటి తాత్కాలిక నియామక ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.