Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసెస్ అంశంపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పెగాసెస్ వివాదంపై జూన్ 20 నాటికి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెగసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మాల్వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందని, టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందని సిజెఐ వెల్లడించారు. మొబైల్ పరికరాల పరిశీలనను వేగవంతం చేయడానికి, తుది నివేదికను అందజేయడానికి టెక్నికల్ కమిటీ నాలుగు వారాల సమయం కోరింది. దీంతో జూన్ 20 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.