Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవీ విరమణ సభలో సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ
న్యూఢిల్లీ : జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది అనీ, ఆయన గాడ్‌ఫాదర్ లేకుండా ఉన్నత స్థాయికి చేరుకున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సేవలను జస్టిస్ ఎన్ వి రమణ కొనియాడారు. శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు పదవీ విరమణ సభలో సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ మాట్లాడారు. సంప్రదాయంలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చివరి పనిదినం రోజు సీజేఐతో కలిసి ధర్మాసనంలో జస్టిస్ నాగేశ్వరరావు కూర్చున్నారు.ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ వత్తిలో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ నేపథ్యం నుంచి దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి ఆయన చేసిన ప్రయాణాన్ని వివరించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి న్యాయవాదులలో సుప్రీంకోర్టులో ఉన్నత స్థాయికి చేరుకోవడం విశేషమన్నారు. ''మేమిద్దరం ఒకే సమయంలో ప్రారంభించాం. అతను గుంటూరు బార్ అసోసియేషన్, విజయవాడ బార్ అసోసియేషన్ నుంచి వచ్చారు. నేను కూడా త్వరలో డిమిట్ కాబోతున్నాను. మేమిద్దరం ఒకే స్థలం నుంచి వచ్చినందున నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అతను ఆర్బిట్రేషన్ ఫీల్డ్‌లో చురుకుగా ఉండబోతున్నాడు. జస్టిస్ రావు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు నేతృత్వం వహిస్తారు. కాబట్టి అతను మాతో సంభాషిస్తూనే ఉంటాడు''అని సీజేఐ అన్నారు.