Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధుకోర్టులో లొంగిపోయారు. శనివారం మధ్యాహ్నం పాటియాలాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఆరోగ్య కారణాలరీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ న్యాయస్థానాన్ని కోరారు. సిద్ధూ తరఫు న్యాయవాది ఎ.ఎం. సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రత్యేక ధర్మాసనం తీర్పు ఇచ్చినందున.. గడువు పిటిషన్పై తాము నిర్ణయం తీసుకోలేమని జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం తెలిపింది. 30 ఏండ్ల క్రితం నాటి కేసులో సుప్రీంకోర్టు సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.