Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌పై మరో కేసు నమోదైంది. 2004 నుండి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే పోస్టుల రిక్రూట్మెంట్లో అవతవకలు జరిగాయంటూ సీబీఐ ఆరోపించింది. రైల్వే ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూమి, ఇతర ఆస్తులు తీసుకున్నారని పేర్కొంది. లాలూకి చెందిన నివాసాలతో పాటు 15 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో యాదవ్‌తో పాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె, ఎంపీ మీసా భారతితో పాటు ఇతర కుటుంబసభ్యులను నిందితులుగా చేర్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.139 కోట్ల డొరండా ట్రెజరీ కుంభకోణం కేసులో ఐదేండ్ల జైలుశిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఆ కేసులో లాలూ గత నెల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ట్రెజరీ కుంభకోణం కేసు ఐదవ దాణా కుంభకోణం కేసుల్లో ట్రెజరీ కేసు ఐదవది. ప్రతిపక్షాలను అంతం చేయడానికి కేంద్రం చేస్తున్నయత్నమిదని ఆర్జేడీ సీనియర్ నేత అలోక్ మెహతా విమర్శించారు. విమర్శల గొంతుకను అణచివేస్తోందని మండిపడ్డారు.