Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీ హెచ్చరిక
లండన్ : ''భారతదేశంలో ప్రజాస్వామ్యమనేది ప్రపంచ మానవాళికి మేలు చేకూర్చేదిగా వుంది. మొత్తంగా భూమండలానికి ఇది కీలకమైన చుక్కాని వంటిది, ఆ ప్రజాస్వామ్యమే బీటలు వారితే మొత్తంగా భూగోళమే సమస్యల్లో పడుతుంది.'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో వున్న ప్రతిపక్ష నేత రాహుల్, స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా నిర్వహించిన ''ఐడియాస్ ఫర్ ఇండియా'' సదస్సులో పాల్గొన్నారు. ''ఒక్క విషయం గ్రహించండి, ప్రజల చెబుతున్నది కూడా వినకుండా వారి గొంతు నులిమేలా బిజెపి వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రజలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ వింటోంది. ఇవి రెండూ భిన్నమైన అంశాలు'' అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, తృణమూల్ నేత మహువా మొయిత్రా కూడా పాల్గొన్నారు.