Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ
నవతెలంగాణ - రాజస్థాన్
సీపీఎస్ ముక్త్ భారత్ చేయడమే తమ లక్ష్యమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ప్రకటించారు. శనివారం రాజస్థాన్‌లోని జైపూర్ అగ్రసేన్ భవన్ లో ఆ సంఘం ఆధ్వర్యంలో దేశంలోని 18 రాష్ట్రాల అధ్యక, ప్రధాన కార్యదర్శులతో కార్యనిర్వహణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీపీఎస్ యూనియన్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పాత పింఛన్ ఇచ్చే పార్టీలకు మాత్రమే సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు వేయాలని తీర్మానించామని చెప్పారు. ఇటీవల సీపీఎస్ ఉద్యోగులకు పాత పింఛన్ ప్రకటించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు దేశంలోని 84 లక్షల కుటుంబాల నుంచి కతజ్ఞతలు ప్రకటించారు. రాజస్థాన్ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగుల పట్ల చూపిన సామాజిక భద్రత దేశంలోని అన్ని రాష్ట్రాలూ చూపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇటీవల చత్తిస్‌ఘడ్ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి దాని కింద ఇప్పటివరకు జమ అయిన కాంట్రిబ్యూషన్‌ను వెనక్కి చెల్లించేలా కోరుతూ పీఎఫ్ఆర్డీఏ చైర్మెన్‌కు లేఖ రాసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం, ఉద్యోగి జమ చేసిన సొమ్ము రూ.11,850 కోట్లు, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.17,240 కోట్లు అని వివరించారు. ఆ మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు మల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ సమావేశంలో ఎన్ఎంఓపీఎస్ రాజస్థాన్ అధ్యక్షుడు విజరు కుమార్ బంధు, కోజారాం, జగదీష్ యాదవ్ (జమ్మూ కశ్మీర్), అష్రాఫ్ (హిమాచల్ ప్రదేశ్), ప్రదీప్ ఠాగూర్ (ఉత్తరప్రదేశ్), త్రిపాఠి (రైల్వే), అమ్రిత్ సింగ్ (ఉత్తరాఖండ్), జీత్ మని (ఒడిశా) తదితరులు పాల్గొన్నారు.