Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహాలన్నీ స్వాధీనం
జమ్మూ : జమ్ము కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో గురువారం పొద్దు పోయిన తర్వాత జరిగిన సొరంగం కూలిపోయిన ఘటనలో మరణించినవారి సంఖ్య 10కి పెరిగింది. మొత్తంగా పది మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా నిర్మించిన ఈ సొరంగం ముఖద్వారం కూలిపోయింది. నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినందుకు సొరంగాన్ని నిర్మించిన కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో సొరంగంలో 13మంది కార్మికులు పనిచేస్తుండగా, 10మంది చిక్కుకుపోయారు. ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం ఒక మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. ఆ తర్వాత మిగిలిన తొమ్మిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో ఆ గాలింపునకు ఆటంకం కలిగింది. తిరిగి శనివారం తెల్లవారు జామున 5గంటలకు మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 7గంటలకు అన్ని మృతదేహాలు లభించాయని అధికారులు ప్రకటించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.