Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-.పెట్రోల్‌పై రూ.8..డీజిల్‌పై రూ.6 తగ్గింపు
- పీఎం ఉజ్వల్ యోజన సిలిండర్‌పై రూ.200 రాయితీ
- రాష్ట్ర పన్నును తగ్గించిన కేరళ
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలకు..ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనం, వంటగ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, పీఎం ఉజ్వల్ యోజన పథకం జారీచేసిన వంటగ్యాస్ కనెక్షన్లపై రాయితీ ప్రకటించింది. కేవలం ఉజ్వల్ యోజన సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇనుము, ఉక్కుపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. ఇదిలా ఉండగా..కేరళలో ఇంధనంపై రాష్ట్ర పన్నును తగ్గిస్తున్నట్టు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రకటించింది. లీ.పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 పన్ను తగ్గిస్తూ ఆ రాష్ట్రంలో వాహనదారులకు కేరళ ప్రభుత్వం ఊరట కల్పించింది.
ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలతోపాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్టు తెలిపింది. ప్రధాని మోడీతో ఆర్థికశాఖ, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల కీలక సమావేశాలు నిర్వహిం చారని, ఇంధన ధరల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో తెలిపారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు నకు సంబంధించి నోటిఫికేషన్ కాసేపట్లో రాబోతోందని ఆమె అన్నారు. సిమెంట్ లభ్యతను పెంచి ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులతో దేశీయంగా ఇంధన ధరల పెంపు తప్పట్లేదని కేంద్రం తొలుత తన విధానాన్ని సమర్థించుకుంది. ఉక్రెయిన్ సంక్షోభానికి ముందే ఇంధన, వంటగ్యాస్ ధరలను భారీగా పెంచుతూ వచ్చింది. సంక్షోభం మొదలయ్యాక...ఉక్రెయిన్ను సాకుగా చూపింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.120కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సరుకు రవాణా, ప్రయాణీకుల రవాణా సైతం ప్రభావితమైంది. నిత్యావసర సరుకుల ధరలన్నీ అనూహ్యంగా మారిపోయాయి. ధరల పెరుగుదలపై వామపక్షాలు ఇప్పటికే దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా రాజకీయంగా తమను దెబ్బతీస్తుందనే సంకేతాలు వెలువడటంతో మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగిందని సమాచారం.
పెంచింది ఎంత..తగ్గించింది ఎంత?
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మొదలు పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచుతూ పోతోంది. 2014 నుంచి 2022 వరకు ఈ 8ఏండ్లలో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను 194శాతం, డీజిల్‌పై 585శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2014నాటికి కేంద్రం వసూలు చేసిన ఎక్సైజ్ పన్ను లీ.పెట్రోల్‌పై రూ.9.20కాగా, ఈ ఎనిమిదేండ్లలో ఈ పన్నును రూ.32.90కు పెంచింది. అలాగే లీ.డీజిల్‌పై రూ.3.46 ఉండగా, ఫిబ్రవరి 2022నాటికి రూ.31.80కు పెంచింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్‌స్థాయిలో రూ.120కు చేరుకున్నాయి.
ప్రతి ఏటా పన్నుల మోత మోగించి, మరోవైపు రాష్ట్రాల పన్నును తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించటం విడ్డూరం. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా దెబ్బతిన్నదని, జీఎస్టీ బకాయిలు కేంద్రం చెల్లించటం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, జీఎస్టీ బకాయిల్ని కావాలనే చెల్లించటం లేదనే ఆరోపణలున్నాయి.