Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి లేఖ రాసినా లేని స్పందన
- నాలుగేండ్ల పెన్షన్ లేకుండానే స్వాతంత్య్ర సమరయోధుడి భార్య మృతి
- నోట్ల రద్దు కారణంగానే : బ్యాంకు సిబ్బంది
న్యూఢిల్లీ : దేశం, సైన్యంపై తమకు తప్ప ఇంకెవరికీ మాట్లాడే అర్హత లేదనే విధంగా వ్యవహరించే బీజేపీ.. ఆ మాటలను మాత్రం చేతల్లో చూపటం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వాకం, నోట్ల రద్దు, బ్యాంకు తీరు కారణంగా స్వాతంత్య్ర సమరయోధుడి భార్య నాలుగేండ్లుగా పెన్షన్‌ను పొందకుండానే కన్నుమూసింది. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖకు ఆమె రాసిన లేఖను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన ఆర్థిక సమస్యలను నుంచి గట్టెక్కి స్వేచ్ఛగా బతికే విధంగా సహాయాన్ని చేయాలంటూ 2017లో స్వాతంత్య్ర సమరయోధుడు నిరంజన్ భట్టాచార్జీ భార్య కళ్యాణి భట్టాచార్జీ (82) ఆ లేఖలో కోరారు. అప్పటి వరకకు స్వతంత్ర సైనిక్ సమ్మాన్ కుటుంబ పెన్షన్ ఆమెకు వచ్చేది. అయితే, కళ్యాణి తరఫున నుంచి ఎలాంటి పొరపాటు లేనప్పటికీ ఆ పెన్షన్ ఆగిపోయింది. ఈ ఆందోళనతోనే పై విధంగా కేంద్రానికి ఆమె లేఖ రాసింది. ఆమె భర్త 1982లో 65 ఏండ్ల వయసులో మరణించారు. దీంతో ఆమె పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోగా.. 1993 నుంచి దానిని పొందుతోంది. అయితే, మే 2016లో పెన్షన్ చెల్లింపులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. 2016లో తన 'లైఫ్ సర్టిఫికెట్'ను సకాలంలో సమర్పించాననీ, అయినప్పటికీ పెన్షన్ ఆగిపోయిందని నిరూపించేందుకు కళ్యాణి అన్ని తలుపులూ తట్టింది. కానీ, ఆమె కోరిక నెరవేరకుండానే 2020 సెప్టెంబర్‌లో మరణించారు.అయితే, పెన్షన్ అందపోవడానికి గల కారణం పెద్ద నోట్ల రద్దు అని బ్యాంకు అధికారులు చెప్పారు. నోట్ల రద్దు సమయంలో విపరీతమైన పని భారం కారణంగా తమ వైపు పొరపాటు జరిగిందని 2019లో బ్యాంక్ అంగీకరించింది. '' ఆమె తన జీవితాన్ని గౌరవంగా, స్వీయ-ఆధారితంగా జీవించగలిగింది. కానీ, బ్యాంకు, కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తప్పులు ఆమె మాపై ఆధారపడేలా మారాయి. ఆమె పూర్తిగా నిరాశతో, ఆందోళనతో, హృదయవిదారకంగా మరణించింది'' అని కళ్యాణి చిన్న కుమార్తె ఇంద్రాణి బసు అన్నారు.
అకస్మాత్తుగా పెన్షన్ ఆగిపోవటంతో హుగ్లీ జిల్లాలోని అలహాబాద్ బ్యాంక్ (ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్) శారదపల్లి బ్రాంచ్‌లో విచారణ చేయగా.. దాని పరిష్కరిస్తామని కళ్యానికి బ్యాంకు అధికారులు చెప్పారు. ఫించనుదారుల జనన ధృవీకరణ పత్రాలను సమర్పించే నెల నవంబర్ వచ్చింది. అయితే, ప్రధాని మోడీ అప్పటికే నోట్ల రద్దును ప్రకటించడంతో ఇది బ్యాంకింగ్ సిబ్బంది ప్రాధాన్యతను కోల్పోయిందని కళ్యాణి కుటుంబీకులు తెలిపారు.