Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్‌లో మధ్యాహ్న భోజనం బారుకాట్
- గత ఏడాది డిసెంబర్లో ఇదే వివాదం..
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాలలో దళిత మహిళ తీవ్రస్థాయిలో కుల వివక్షను ఎదుర్కొంటోంది. చంపావత్ జిల్లా సుఖీధాంగ్ అనే గ్రామంలో సామాజికంగా ఒక వర్గానికి చెందినవారు ఆ మహిళను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారు. స్కూల్లో భోజనమాతగా పనిచేస్తున్న దళిత మహిళ సునీత వండిన ఆహారాన్ని తిరస్కరిస్తూ కొంతమంది విద్యార్థులు బారుకాట్ చేశారు. ఆమెతో వంట చేయిస్తే..మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులు బారుకాట్ చేస్తారని గ్రామంలోని ఒక సామాజికవర్గానికి చెందినవారు బెదిరింపులకు దిగారు. గత ఏడాది డిసెంబర్లో పాఠశాలలో ఇదే వివాదం తలెత్తింది. ఆమెను భోజనమాతగా నియమించరాదని పాఠశాల టీచర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు.''దళితురాలిని కాబట్టి విద్యార్థులకు వంట చేయవద్దని కొంతమంది గొడవ చేస్తున్నారు. ఈ పరిస్థితి నా మనసును ఎంతగానో గాయపర్చింది. తీవ్రంగా అవమానించారు. నాకు న్యాయం చేసేవారు ఎవరు? గౌరవంగా పనిచేసుకోనివ్వరా?'' అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.