Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యావేత్తలు, మేధావుల గొంతును అణచివేస్తున్నారు : ఢిల్లీ వర్సిటీ విద్యార్థులు
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న జ్ఞానవాపీ మసీదు వివాదంపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్‌లాల్ చేసిన వ్యాఖ్యలు పాలకులకు రుచించలేదు. దాంతో ఆయన్ని కటకటాల వెనక్కినెట్టి..కేంద్రం ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ పోలీసులు ప్రొఫెసర్ రతన్‌లాల్‌పై రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి జైలుకు పంపారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్‌ను రాత్రిపూట అరెస్టు చేసి, పోలీసులు తీసుకెళ్లిన విధానం వర్సిటీ విద్యార్థుల్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో విద్యార్థులంతా వర్సిటీ ఆవరణలో నిరసనకు దిగారు. ఒక అంశంపై ప్రొఫెసర్ చేసిన విమర్శను తట్టుకోలేక, పాలకులు ఆయన గొంతును అణచివేస్తున్నారని వారు ఆరోపించారు. వర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.