Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షతగాత్రులకు ఉచిత వైద్యం, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
జమ్ము : జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా ఖోని నల్లాహ ప్రాంతంలో టన్నల్ కూలిపోయిన ఘటనపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ తరిగామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టన్నల్ కూలిన ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతి చెందగా, ముగ్గురిని రక్షించారు. మిగతా భారత దేశాన్ని కాశ్మీర్‌తో అనుసంధానించే రాంబన్-బనిహల్ జాతీయ రహదారి కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. అనేక గడువులు ఇచ్చినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని తరిగామి పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులను ఎస్ఐజిఎఎల్కు ఎన్హెచ్ఎఐ అప్పగించింది.ఈ తరువాత ఎస్ఐజిఎఎల్ ఈ పనులను ఎస్ఎఆర్ ఎల్ఎకు అప్పగించింది. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, పైగా ఎలాంటి సాంకేతికలేదని విమర్శించారు. సంఘటనా ప్రాంతాన్ని డివిజనల్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు సందర్శించాలని తరిగామి డిమాండ్ చేశారు. టన్నల్ నిర్మాణ స్థలంలో చెత్తాచెదారాన్ని తొలగించలే దని,మట్టిని శాస్త్రీయంగా పరిశీలించకుండానేే నిర్మాణ పనులు ప్రారంభించినట్లు సమాచారం ఉందని తెలిపారు. నిర్మాణ సంస్థకు, ప్రభుత్వానికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని, ఇది సాధారణమైన సంఘటన కాదని, ఇందులో నేరపూరిత నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. దోషులను గుర్తించి, న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి ఈ దారుణ సంఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.40 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రత్యేకంగా ఉచిత వైద్య చికిత్స అందించాలని తరిగామి కోరారు.