Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్టీఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కెసి హరికృష్ణన్, సిఎన్ భారతి
- ముగిసిన మహాసభ
అమరావతి : స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కెసి హరికృష్ణన్, సిఎన్ భారతీలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.మూడు రోజుల పాటు జరిగిన ఫెడరేషన్ 8వ మహాసభ ఆదివారం ముగిసింది. చివరి రోజు 23 మందితో ఆఫీస్ బేరర్స్ను ఎన్నుకుంది. కెసి హరికృష్ణన్(కేరళ), సిఎన్ భారతీ(హర్యానా)లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులగా ఎన్నిక కాగా, ఉప ప్రధాన కార్యదర్శిగా సుకుమార్ఫైన్(పశ్చిమ బెంగాల్), కోశాధికారిగా ప్రకాష్ చంద్ర మహంతి(ఒడిశా), ఉపాధ్యక్షులుగా ఎన్టి శివరాజన్(కేరళ), ఎన్ వెంకటేశ్వర్లు(ఏపీ), ఎం సంయుక్త(తెలంగాణ), ఎస్ మైలీ(తమిళనాడు), మహావీర్ సింగ్ సిహగ్(తమిళనాడు), చావా రవి(తెలంగాణ), వినోద్ బెహరి పాణిగ్రహీ(ఒడిశా), చారులత మహాపాత్ర, (ఒడిశా)లను ఎన్నుకుంది. కార్యదర్శులుగా కెఎస్ఎస్ ప్రసాద్(ఆంధ్రప్రదేశ్), కె బదరున్నీసా(కేరళ), ఎన్ అరుణ కుమారి(ఆంధ్రప్రదేశ్), కృష్ణాప్రసున్న భట్టాచార్య(పశ్చిమ బెంగాల్), నాగేంద్ర సింగ్(బీహార్), సాయిబాల్ రారు(త్రిపుర),ధర్మేందర్ సింగ్(హర్యానా), ఎ శంకర్(తమిళనాడు)లను కార్యదర్శులుగా ఎన్నుకుంది. సురేందర్ కంబోజ ్(పంజాబ్)ను ఆహ్వాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. బెంగాల్ నుంచి ఉపాధ్యక్ష, కార్యదర్శులుగా ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. 47మందిని సీఈసీ సభ్యులుగా, 90 మందిని జనరల్ కౌన్సిల్ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఎన్ఈపీ, ఎన్పీఎస్ రద్దుకై ఐక్య ఉద్యమాలు
జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)-2020, నూతన పెన్షన్ విధానం(ఎన్పీఎస్) రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని మహాసభ తీర్మానించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కూడా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. ఉద్యోగులు, కార్మికులు, ఇతర సంఘాలను కలుపుకుని నిరంతరం ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించిన్నట్లు సిఎన్ భారతీ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. జూన్ 1 నుంచి 20వ తేది వరకు జిల్లా స్థాయిలో ధర్నా, ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. జులై 7వ తేది రాష్ట్రాస్థాయి ధర్నా, జులై 17వ తేది ఢిల్లీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి 31వ తేది వరకు మండల, జిల్లా స్థాయిలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీ ప్రజల మధ్య అంతరాలను పెంచుతుందని అధ్యక్షులు కెసి హరికృష్ణన్ అన్నారు. కేంద్రప్రభుత్వం విద్యను ప్రజలను దూరం చేస్తుంటే కేరళ ప్రభుత్వం విద్య, ఆరోగ్యాన్ని ప్రజలకు మరింత చేరువచేసే కార్యాచరణ చేస్తుందన్నారు. ఎన్ఈపీ,ఎన్పీఎస్ రద్దు కోసం ఎస్టీఎఫ్ఐ, పీడీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు పీడీఎఫ్ పక్షాన మద్దతు ఉంటుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వెల్లడించారు. ఈ మహాసభలో మొత్తం 31 సంఘాలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్టీఎఫ్ఐ కోశాధికారి ప్రకాశ్ చంద్రమహంతి, ఉప ప్రధాన కార్యదర్శి సుకుమార్ పెయిన్, యుటిఎఫ్ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేయాలి: హరికృష్ణన్
ఫెడరేషన్ బలోపేతానికి అందరూ కృషి చేయాలని అధ్యక్షులు కెసి హరికృష్ణన్ అన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఆయన మహాసభలో ప్రసంగించారు. దేశంలో బలమైన సంఘంగా ఫెడరేషన్ ఉండాలని కోరారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.. మహాసభను యుటిఎఫ్ విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. ఫెడరేషన్ ఆర్థిక నివేదికను కోశాధికారి ప్రకాష్ చందర్ మహంతీ ప్రవేశపెట్టారు. సంస్థ నిబంధనావళిలో మార్పులు చేయడం వల్ల సెంట్రల్ ఎగ్జీక్యూటీవ్ కమిటీ(సిఇసి)లో మహిళల భాగస్వామ్యం 39.19శాతానికి పెరిగిందని మహిళల సబ్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టిన కె బదిరున్నీసా చెప్పారు. అర్హతల నివేదికను ఉపాధ్యక్షులు చావా రవి ప్రవేశపెట్టారు. ఎస్టిఎఫ్ఐ బిల్డింగ్ ఫండ్ కింద రూ.6.70లక్షల చెక్కును టిఎస్యుటిఎఫ్ ప్రతినిధులు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంఘాలకు, అదేవిధంగా ఫెడరేషన్ అధ్యక్షునిగా రిలీవ్ అయిన అభిజిత్ ముఖర్జీ, కార్యదర్శి పి బాబురెడ్డి, ఇతర నాయకులకు యుటిఎఫ్ జ్ఞాపికలను అందజేసింది.