Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంలో ప్రొఫెసర్ అరెస్ట్
డిస్పూర్ : ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. అసోం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఒక ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. అసోంలోని హైల్కండి జిల్లాలోని ఒక కళాశాలలో పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ జిల్లా పోలీస్ అధికారికి ఖాతాకు ఈ మెయిల్ పంపారని అన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులపై నిబంధనలకు విరుద్ధంగా అసభ్య పదజాలాన్ని వినియోగించారని అన్నారు. జాతీయ విద్యావిదానం 2020తో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న 'గుణోత్సవ్' కార్యక్రమాన్ని కూడా విమర్శించారని అన్నారు. ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తొలగించేందుకు విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమమని అన్నారు. ఆ ప్రొఫెసర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ప్రొఫెసర్ అరెస్ట్ పై తనకు సమాచారం లేదని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొనడం గమనార్హం.
అసోం బుల్డోజర్ డ్రైవ్
బీజేపీ ప్రభుత్వ బుల్డోజర్ డ్రైవ్ అసోంకి చేరింది. తాజాగా పోలీస్ స్టేషన్‌కి నిప్పు పెట్టిన వారి నివాసాలను ఆదివారం ఉదయం అక్కడి అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. సుమారు ఐదు కుటుంబాలకు చెందిన ఇండ్లను నాగోవ్ జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా వారి నివాసాలను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.శనివారం అసోంలోని నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు కొందరు వ్యక్తులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి మరణించాడు. లంచం ఇవ్వలేదనే ఆగ్రహంతో పోలీసులు అతనిని హత్యచేశారని వారు ఆరోపిస్తూ.. బటాదాబ్రా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్ లోని ఫర్నీచర్ ధ్వసం చేయడంతో పాటు స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సఫీకుల్ ఇస్లాం మృతిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనికి బాధ్యతగా బటద్రాబా పోలీస్ స్టేషన్ పిఎస్‌ను సస్పెండ్ చేశామని అసోం డీజీపీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారంతా మతుని బంధువులేనని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారంతా మతుని బంధువులు కారని, వారిలో కొంతమందికి గతంలో నేర చరిత్ర ఉందని అన్నారు.