Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాజా విచారణపై నేడు ఉత్తర్వులు
వారణాసి : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్వాపీ మసీదు కేసును విచారించనున్న వారణాసి సీనియర్ మోస్ట్ జడ్జీ ఈ కేసు తాజా విచారణ తేదీని, అనుసరించాల్సిన ప్రక్రియపై మంగళవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే, 'నిర్వహణసామర్థ్యం' కేసును ముందుగా విచారించాలని మసీదు కమిటీ చేస్తున్న విజ్ఞప్తిని అంగీకరించాలా లేదా అన్న విషయంపైనా మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
వారణాసి జిల్లా జడ్జి కోర్టులో సోమవారం 2 నుంచి 3 గంటల మధ్య 30 నిమిషాల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో 'కేసు మెయింటెనబుల్ కాదంటూ మేం వేసిన పిటిషన్‌ను ముందుగా విచారించాలనేది సుప్రీం కోర్టు ఆదేశమని కోర్టుకు తెలిపాను' అని మసీదు కమిటీ తరపు న్యాయవాది అభరు నాథ్ యాదవ్ మీడియాకు తెలిపారు.
జ్ఞాన్వాపీ మసీదులో వీడియో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ సందర్భంగా, ఈ కేసును ఉత్తరప్రదేశ్‌లోని సీనియర్ మోస్ట్ జడ్జీ విచారిస్తారని సుప్రీంకోర్టు గతవారంలో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఈ కేసు సంక్లిష్టమైనది, సున్నితమైనది. దీనిని సీనియర్ మోస్ట్ జడ్జీ విచారించాలి' అని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే, మీడియాకు 'సెలెక్టివ్ లీక్‌లు' ఆగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.