Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని, దేశంలోని సమాఖ్య నిర్మాణాన్ని బుల్డోజింగ్ చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అడల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సులోని కన్నా బిజెపి పాలన దారుణంగా ఉందని విమర్శించారు. కోల్కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేయడానికి అనుమతించాలని మమతా పేర్కొన్నారు.