Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా అనిల్ బైజల్ ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆయన స్థానంలో కొత్త ఎల్జీని నియమించారు. నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినరు కుమార్ సక్సేనాను నియమించినట్టు రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో అనిల్ బైజల్ ఇటీవల అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినరు కుమార్ సక్సేనాను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వినరు కుమార్ సక్సేనా ప్రస్తుతం భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మెన్ గా ఉన్నారు.