Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంతో కూలిన ఇండ్లు, నేలకొరిగిన చెట్లు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణంతో విమానాల సర్వీసులపై ప్రభావం పడింది. గోడలు కూలీ ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. వర్షం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో గంటకు 50-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలి ఇండ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా మండుటెండలతో అల్లాడుతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.