Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, మహారాష్ట్రలో ఇది అధికం : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో జడ్జీలపై ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందని, జడ్జీలను లక్ష్యంగా కేసులు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. కోర్టు ధిక్కారం ప్పాలడిన ఒక న్యాయవాదిని దోషిగా నిర్థారించి, మద్రాస్ హైకోర్టు అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో పై వ్యాఖ్యలు చేసింది. 'జడ్జీ బలంగా ఉంటే, ఆరోపణలు అంత అధ్వానంగా ఉంటాయి' అని కోర్టు వ్యాఖ్యానించింది. జడ్జీలపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, జిల్లా న్యాయమూర్తులకు భద్రత లేదని, ఒక్కోసారి లాఠీ ఝులిపించే పోలీసు కూడా అందుబాటులో ఉండరని జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవాదికి విధించిన జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. న్యాయవాదులు చట్టానికి అతీతం కాదని తెలిపింది. 'న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పరిణామాలను వారు కూడా ఎదుర్కొవలసి ఉంటుంది' అని పేర్కొంది. 'ఇటు వంటి న్యాయవాదులు న్యాయ ప్రక్రియకు మచ్చ, తప్పకుండా కఠినంగా వ్యవహరించాలి' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉందని తెలిపింది.