Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45వ ఐఎల్సీ సిఫారసులను కేంద్రం అమలుజేయాలి
- ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేసి..
- కనీస వేతనాలివ్వాలి : ఎ.ఆర్.సింధు
న్యూఢిల్లీ :ఆశా వర్కర్ల సేవలు గుర్తించి..వారికి 'గ్లోబల్ హెల్త్ లీడర్స్' పురస్కారం దక్కటంపై 'ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఆషా వర్కర్స్, ఫెసిలిటేటర్స్' (ఏఐసీసీఏడబ్ల్యూ) నాయకురాలు ఎ.ఆర్.సింధు సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోని 10లక్షల మందికిపైగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పురస్కారాన్ని అందజేయటాన్ని ఏఐసీసీఏడబ్లూ స్వాగతిస్తోందన్నారు. దేశంలో ప్రతి ఒక్క ఇంటిని తడుతూ ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల విధులకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. మరోవైపు మోడీ సర్కార్ ఆశావర్కర్ల శ్రమను దోచుకుంటోందని, వారికి కనీస వేతనాలు అందించటం లేదని ఆమె ఆరోపించారు. 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫారసులను అమలుజేయాలని ఎ.ఆర్.సింధు మోడీ సర్కార్ను డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనాలు, సామాజిక భద్రత, పెన్షన్ అందజేయాలని కోరారు.