Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46 నుంచి 54వ స్థానానికి పతనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పర్యటక అభివృద్థిలో భారత స్థానం మరింత దిగజారింది. 2019లో 46వ స్థానంలో ఉన్న భారత్ తాజాగా 54వ స్థానానికి పడిపోయిందని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు చెందిన ట్రావెల్ అండ్ టూరిజం అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ట్రావెల్ అండ్ టూరిజం 2021 సూచీలో 117 దేశాలను భాగస్వామ్యం చేసింది. గత 15 ఏండ్ల నుంచి ఈ రిపోర్ట్‌ను తయారుచేస్తోంది. కరోనా సంక్షోభం, అనేక సవాళ్ల నుంచి ఈ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని పేర్కొంది. 'కరోనా ఆంక్షలు, లాక్డౌన్ చర్యలు అనేక దేశాల పర్యాటక, ప్రయాణ రంగాలను తీవ్ర ప్రభావితం చేశాయి. ఈ రంగంలో మంచి వాతావరణాన్ని కల్పించడానికి బలమైన పెట్టుబడులు అవసరం' అని డబ్ల్యూఈఎఫ్లోని ఏవియేషన్, ట్రావెల్ అండ్ టూరిజం హెడ్ లౌరెన్ ఉపింక్ పేర్కొన్నారు. 'స్థూలంగా అంతర్జాతీయ టూరిజం, వ్యాపార ప్రయాణాలు ఇప్పుటికీ కరోనా ముందు నాటి స్థాయికంటే దిగువనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ పెరిగినందున పర్యాటకం తిరిగి మరింత తెరుచుకోవాల్సి ఉంది. దేశీయ, ప్రకృతి ఆధారిత టూరిజం డిమాండ్ భారీగా పెరగాలి' అని ఈ రిపోర్ట్ పేర్కొంది. గ్లోబల్ చార్ట్‌లో జపాన్ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విజ్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, ఇటాలీ పర్యాటకంలో ఆత్యంత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇప్పటికే సామాజిక, స్వేచ్ఛా, వ్యాపారం, సమానత్వం తదితర అనేక రంగాల్లో భారత్ వెనుకబడిపోతుందని అనేక రిపోర్టులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.