Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామ్రెడ్ శివాజీ పట్నాయక్ మృతిపై సీఐటీయూ సంతాపం
న్యూఢిల్లీ : ఒడిషాలో కార్మిక, కర్షక ఉద్యమంలో కామ్రెడ్ శివాజీ పట్నాయక్ ముఖ్యపాత్ర పోషించారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. పట్నాయక్ మృతిపై సీఐటీయూ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోందని అన్నారు. యువకుడిగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొని పార్టీ రాష్ట్ర నాయకుడిగా పట్నాయక్ ఎదిగారని, కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించారని తెలిపారు.కార్మిక నాయకుడిగా శివాజీ పట్నాయక్ లేనిలోటు పూడ్చలేనిదని,కార్మికసంఘాల్ని ఒక్కతాటిపైకి తేవటంలో శివాజీ పట్నాయక్ కృషి ఎంతో ఉందని తపన్‌సేన్ గుర్తుచేసుకున్నారు.'నాల్కో' ప్రయివేటీకరణ ను వ్యతిరేకిస్తూ పట్నాయక్ నేతృత్వంలో సాగిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఒడిషా సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని,భువనేశ్వర్ పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపికై ప్రజల కోసం పనిచేశారని మీడియాకు విడుదలచేసిన ప్రకటనలో తపన్‌సేన్ పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పట్నాయక్ కుటుంబ సభ్యులకు, ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.