Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివాజీ పట్నాయక్ కన్నుమూత
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) సీనియర్ నేత, ఒడిషా రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ కార్యదర్శి శివాజీ పట్నాయక్ (92) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) ప్రగాఢ సంతాపం తెలిపింది. శివాజీ పట్నాయక్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. ఆయన చాలా చిన్న వయస్సులోనే విద్యార్థి ఉద్యమంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చేరిన కొద్ది కాలానికే సీపీఐ రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికయ్యారు. 1964లో పార్టీ చీలిక సమయంలో సీపీఐ(ఎం) ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1972 నుంచి 1990 వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1978లో జరిగిన పార్టీ 10వ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికై 1989 వరకు కొనసాగారు. ఆయన కిసాన్ ఉద్యమంలోనూ, రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోనూ పనిచేశారు. ఒడిషాలో సీఐటీయూ ఏర్పడినప్పుడు ఆ సంఘం మొదటి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. అలాగే భువనేశ్వర్ స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య ప్రతిభ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీపీఐ(ఎం) సానుభూతి తెలియజేసింది.