Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కీలక కమిటీలు నియామకం
- పొలిటికల్ అఫైర్స్ కమిటీలో జి-23 నేతలకు అవకాశం : సోనియా గాంధీ నిర్ణయం
న్యూఢిల్లీ : సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌ను నిర్వహించింది. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభ వం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నా రు.2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల కోసం టాస్క్‌ఫో ర్స్ 2024ను సోనియా గాంధీ మంగళవారం వెల్లడిం చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించగా.. ఇద్దరు కీలక అసమ్మతివాదులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు దక్కిం ది. అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి స్థానం దక్కిం ది.కాగా, చింతన్ శిబిర్‌లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలు చేయాలని ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలో ప్రియాంకకు స్థానం దక్కడం రాజకీయంగా ప్రాధాన్య ం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగోలు పార్టీ ఎన్నికల నిర్వహణ కోసం ఎంపికయ్యారు. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ-23)కు సైతం చోటుద క్కింది.మరోవైపు..కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర(భారత్ జోడో యాత్ర) చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తం గా వున్న నిరుద్యోగ సమస్యను హైలెట్ చేయాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ కమిటీని ప్రకటించారు.