Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం : సీఎం నితీశ్‌కుమార్
న్యూఢిల్లీ : కులాల వారీగా జనాభా లెక్కింపును చేపట్టేందుకు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కులాల వారీగా జనాభా లెక్కింపుపై సీఎం నితీశ్ వివిధ పార్టీల అభిప్రాయం తీసుకోనున్నారట! వివిధ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూచనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తారట. గతకొంత కాలంగా బీజేపీ-జనతాదళ్ (యు) సంకీర్ణ ప్రభుత్వం కుల ఆధారిత జనాభా లెక్కింపుపై మల్లగుల్లాలు పడుతోంది. ''జనాభా లెక్కింపుపై ఎలాంటి సమస్యా లేదు. రాష్ట్ర అసెంబ్లీ, విధానసభ కుల ఆధారిత జనాభా లెక్కింపుపై ఆమోదముద్ర వేశాయి'' అని తాజాగా సీఎం నితీశ్‌కుమార్ అన్నారు. అయితే దీనిపై మిత్రపక్షం బీజేపీ సుమఖంగా లేదని వార్తలు వెలువడుతున్నాయి.